భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ముందుగా సీపీఎం సీనియర్ నాయకులు ఈరన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి వ్యవసాయ కూలీల పని హక్కును కాలరాస్తోందని విమర్శించారు. ఈ చట్టం ద్వారా కోట్లాది కూలీలకు ఉపాధి లభిస్తోందని, స్త్రీ–పురుషులకు సమాన వేతనం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ హక్కును రక్షించేందుకు కూలీలు దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1న సంతకాల సేకరణ, ఫిబ్రవరి 2న సచివాలయాల ముందు మహాజర్లు, ఫిబ్రవరి 5న మండల కేంద్రాల్లో ధర్నాలు, ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
31, జనవరి 2026, శనివారంభారత్ సమాచార్