భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, ఫిబ్రవరి 2026, బుధవారంభారత్ సమాచార్

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన

3

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తి,పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని షామియా చాకో స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హైదరాబాద్ వారు నిర్వహించారు.10వ తరగతి తర్వాత సరైన కెరీర్‌ను ఎంచుకోవడం అనేది మీ జీవితంలో అత్యంత కీలకమైన నిర్ణయం. 2026లో మారుతున్న టెక్నాలజీ అవకాశాలను బట్టి, మీరు కేవలం ఇతరులను చూసి కాకుండా మీ ఆసక్తిని బట్టి నిర్ణయం తీసుకోవాలి.పది తర్వాత అందుబాటులో ఉన్న ప్రధాన మార్గాలు గురించి తెలియజేశారు. ఇంటర్మీడియట్ దీనిని చాలా మంది విద్యార్థులు ఎంచుకునే సాధారణ మార్గం ఇది. ఇందులో ప్రధానంగా సైన్స్ స్ట్రీమ్,ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, డిఫెన్స్ లేదా డేటా సైన్స్ వైపు వెళ్లాలనుకునే వారికి ఉత్తమం.బైపిసిడాక్టర్, ఫార్మసీ, అగ్రికల్చర్, లేదా బయోటెక్నాలజీ లక్ష్యంగా ఉన్నవారికి.కామర్స్ స్ట్రీమ్,బిజినెస్, అకౌంట్స్, ఫైనాన్స్ మీద ఆసక్తి ఉంటే ఇది సరైనది. , సి ఏ సి ఎస్ లేదా ఎంబీఏచేయాలనుకునే వారికి ఇది పునాది.సివిల్ సర్వీసెస్, లా, జర్నలిజం, సైకాలజీ లేదా డిజైనింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఇది చాలా మంచిది.పాలిటెక్నిక్ డిప్లొమా,టెక్నికల్ రంగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.ఇది పూర్తి చేసిన ఐటిఐ వారికిత్వరగాఉపాధిపొందాలనుకునే విద్యార్థులకు ఇది ఒక వరం.ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, డీజిల్ మెకానిక్ వంటి వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి.రైల్వేలుప్రభుత్వ రంగ సంస్థల్లో టెక్నీoషియన్ ఉద్యోగాలకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

ఈ కోర్సులకు మంచి డిమాండ్

వొకేషనల్ కోర్సులు,నర్సింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి ప్రత్యేక రంగాల్లో తక్షణ శిక్షణ కోసం వీటిని ఎంచుకోవచ్చు.సరైన కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలిమీ ఆసక్తిని గుర్తించండి మీకు లెక్కలు ఇష్టమాసైన్స్ ప్రయోగాలు ఇష్టమా లేక సమాజం వ్యాపారం గురించి తెలుసుకోవడం ఇష్టమా అని ఆలోచించండి.బలాలు బలహీనతలు ఒక సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తున్నాయంటే, కేవలం ట్రెండ్ కోసం ఆ స్ట్రీమ్ తీసుకోకండి. భవిష్యత్తు అవకాశాలు 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ డేటా అనలిటిక్స్ వంటి రంగాలకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి నీకు తోచిన రంగాల్లో పదవ తరగతి తరువాత చేరి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.సాంబయ్య మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పూర్తి అయిన తర్వాత మంచి కెరీర్ ఎంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, నరసింహారెడ్డి, చార్లెస్, అమూల్య, సునీత,పద్మజ, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.