భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతల బాలమణి రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోసపూరితమైన పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని, స్కాంలు చేసే వారికే బీఫాంలో ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 24 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసి నేడు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఫామ్ ఇస్తామని ఆశచూపి ఇంట్లో పూజలు చేస్తూ గృహిణిగా ఉండే నన్ను వార్డులో తిరిగి ప్రచారం చేసుకోమని చెప్పి నేడు బీఫామ్ ఇవ్వకుండా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసేందుకు పార్టీ నాయకులు సైతం వెంట రావడం జరిగిందని అందరితో కలిసి నామినేషన్ వేయడం జరిగిందని చివరికి బీఫామ్ కష్టపడ్డ వ్యక్తికి ఇవ్వకుండా మున్సిపల్ పట్టణంలో రెండున్నర కోట్లు స్కామ్ చేసిన వ్యక్తికి ఇవ్వడం సిగ్గుచేటు అని వారన్నారు. నమ్మించి మోసం చేసిన పార్టీకి తగిన గుణపాఠం తప్పదన్నారు. కష్టపడ్డ వారికి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
4, ఫిబ్రవరి 2026, బుధవారంభారత్ సమాచార్