భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, ఫిబ్రవరి 2026, గురువారంభారత్ సమాచార్

కాంగ్రెస్‌తోనే నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి: మంత్రి వివేక్

27dad611-d1e0-4132-b091-51b59827863b

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలోని 2వ, 3వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల కాళ్ళు మొక్కండి లేదా కడుపులో తల పెట్టి ఓట్లు అడగాలని కాంగ్రెస్ అభ్యర్థులకు సూచించారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పలు చేసిందని, కేసీఆర్ తమ కుటుంబ కోసం మాత్రమే తెలంగాణ ప్రభుత్వం పని చేసి ప్రజలకు అప్పుల పలు చేశాడన్నారు. 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల అప్పు చేశాడని విమర్శించారు. ఈ సంవత్సరం లో 45 కోట్లు నిధులు నర్సాపూర్ మున్సిపాలిటీకి మంజూరు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో నర్సాపూర్ అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదన్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ ఓటు వేస్తే నర్సాపూర్ మున్సిపాలిటీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.