భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, ఫిబ్రవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

పనులు పూర్తై మూడేళ్లు.. మోక్షమెప్పుడో

1e5becd4-f794-405c-9fab-28bb50a344e6

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా:  మెండోరా మండల కేంద్రంలో నిరుపేద ప్రజల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 64 రెండు పడకల గదులను నిర్మించింది. మూడు సంవత్సరాల నుంచి అవి శిథిలావస్థకు చేరేలా నిమ్మకు నిరేత్తినట్టు అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 64 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు గత మూడేళ్ల క్రితమే పూర్తి అయినప్పటికీ ఇప్పటికి అర్హులైన పేద ప్రజలకు కేటాయించి ఇవ్వకపోవడంతో అధికారులపై స్థానికంగా పలు విమర్శలు వెళువెత్తుతున్నాయి.  ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో అప్పటి తహసీల్దార్లు గ్రామ సభలల్లో అర్హులైన వారికి ఇండ్లని కేటాయించి లబ్ధిదారుల పేర్లను లిస్టుఅవుట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ లిస్టుని గాలికి వదిలేసి తిరిగి లబ్ధిదారుల కొత్త లిస్టును ఎంపిక చేయాలని గత రెండేళ్లుగా ప్రస్తుత మండల అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి రెండు పడకల గదుల ఇండ్లను కేటాయించి వెంటనే ఇవ్వాలని మెండోరా గ్రామస్తుడు బుక నర్సయ్య, తదితరులు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు.