భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, ఫిబ్రవరి 2026, శనివారంభారత్ సమాచార్

ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

672f8552-84f5-4f78-95a6-72ec5a99d94b

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కొల్చారం మండలం పరిధిలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాంపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ18,600 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారు బోలా శేఖర్, కత శ్రీనివాస్, మస్కరి శ్రీశైలం, గుమ్మడి సురేష్, మ్యాకల యాదగిరి పోలీసులు గుర్తించారు. వారిని కొల్చారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, బెట్టింగ్ వంటి చర్యల వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత తప్పు మార్గాలు ఎంచుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.