భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, ఫిబ్రవరి 2026, శనివారంభారత్ సమాచార్

ఆడబిడ్డ జన్మిస్తే 10వేల సాయం.. సూగూరు శ్రీనివాసులు కొత్త పథకం

300df26a-8d16-4cb9-848b-41d763a98389

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ​వనపర్తి మున్సిపాలిటీలోని 26వ వార్డు (టీచర్స్ కాలనీ) బీఆర్ఎస్ అభ్యర్థి సూగూరు శ్రీనివాసులు వార్డు ప్రజల కోసం ఒక గొప్ప సామాజిక పథకాన్ని ప్రకటించారు. వార్డు పరిధిలో నివసించే ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ జన్మిస్తే, ఆ పాప భవిష్యత్తు కోసం తన వంతు సహాయంగా రూ.10 వేల ఆర్థిక భరోసా కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ​పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. టీచర్స్ కాలనీలోని ఆడబిడ్డల ఉన్నత చదువులకు, ఆరోగ్యానికి ప్రారంభ దశలోనే తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. 26వ వార్డు పరిధిలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ సహాయం అందుతుందని వెల్లడించారు. ​”ఆడపిల్ల పుడితే ఆ ఇల్లు కళకళలాడుతుంది. టీచర్స్ కాలనీలోని నా కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికీ నేను తోడుంటానన్నారు. మన వార్డులో పుట్టే ప్రతి ఆడబిడ్డకు రూ.10 వేల ఆర్థికసాయం అందజేయడం ద్వారా వారి భవిష్యత్తుకు నా వంతుగా ఒక చిన్న పునాది వేయాలనుకుంటున్నాను. కేవలం తాను ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, వార్డులోని ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమే తన లక్ష్యమని సూగూరు శ్రీనివాసులు పేర్కొన్నారు.

 

మరిన్ని కథనాలు: 

ఆశీర్వదించండి.. అభివృద్ది చేసి చూపిస్తా: సూగూరు శ్రీనివాసులు