భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, ఫిబ్రవరి 2026, శనివారంభారత్ సమాచార్

రామాయంపేట మున్సిపాలిటీలో బీజేపీ బైక్ ర్యాలీ

6a783675-a6f6-46ca-b9ed-e72030ac0ef4

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీలో శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీలోని 12వ వార్డులలో బిజెపి అభ్యర్థులు పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ బైక్ ర్యాలీలో ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపి శెట్టి అనంత లక్ష్మి రమణ, ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పబ్బ చంద్రకళ సత్యనారాయణ పాల్గొనగా, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే మాజీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్, నవత్ రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీ సందర్భంగా బిజెపి జెండాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా బైకులపై సాగుతూ నినాదాలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలను తీసుకురావడం జరిగిందని, బడ్జెట్లో మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని ఆమె తెలిపారు, కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో వార్డులలో ప్రచారం చేయడం జరుగుతుందని, రామాయంపేట మున్సిపాలిటీలోని 12వ వార్డులో బైక్ ర్యాలీ నిర్వహించి దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమన్నారు. బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రామాయంపేట మున్సిపాలిటిపై బీజేపీ జెండా ఎగరవేయాలని ఆమె కోరారు.