భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని పలు వార్డులలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలే మా అజెండా. ప్రతి వార్డును సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ సంకల్పం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, నాణ్యమైన రహదారులు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ, పరిశుభ్రమైన పారిశుద్ధ్యం ఇవన్నీ మా బాధ్యతగా తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు. అలాగే వీధి లైటింగ్ బలోపేతం, పట్టణ భద్రతా చర్యల పెంపు, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ పారదర్శకంగా అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి కొత్త దిశ, కొత్త దశను ప్రారంభిస్తామన్నారు. అనంతరం హనుమంతపూర్ లోనీ శ్రీ మల్లన్న జాతర ఉత్సవాలో పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అబ్జర్వర్ ధనలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
BHARATH SAMACHAR DIGITAL
10, ఫిబ్రవరి 2026, మంగళవారంభారత్ సమాచార్