భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని పలు వార్డులలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలే మా అజెండా. ప్రతి వార్డును సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ సంకల్పం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, నాణ్యమైన రహదారులు, సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ, పరిశుభ్రమైన పారిశుద్ధ్యం  ఇవన్నీ మా బాధ్యతగా తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు. అలాగే వీధి లైటింగ్ బలోపేతం, పట్టణ భద్రతా చర్యల…