భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, ఫిబ్రవరి 2026, మంగళవారంభారత్ సమాచార్

కవి “రాజిరెడ్డి”పుట్టినరోజు సందర్భంగా కవిత

7

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తి కి చెందిన ఆధునిక భావకవి శీలం రాజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జన్మనిచ్చిన మాతృమూర్తులు, అక్షర జ్ఞానం చేసిన గురువులు, ఆటలు నేర్పిన కొమురయ్య సార్ లను గుర్తుచేస్తూ.. పెద్దల ఆశీస్సులు కోరుతూ తానే అక్షర కూర్పు చేసి కవిత రాశారు.

“అమ్మ” “ఆలి” పోషణలో
అరవైకి చేరుకున్న.
కన్న ప్రేమ కట్టుకొన్న ప్రేమ
ఆ ఇద్దరి కంటి పాపనై
చంటి పాపనై బ్రతుకుతున్న.
ఆలనా పాలనా
వెల కట్ట లేని వారి లాలనా
ఆ అమృత మూర్తుల
హస్తాలలో పొదిగి ఉన్న
దాగి ఉన్న దాచుకున్న.

కడుపు చూసే అమ్మ
కరుణ చూపే అంటుకొమ్మ
ఇంటి పని నా ఒంటికి పడదని
ఇంట్లో వీసమెత్తు పనిచెప్పక
అరవైకి మోసుకొచ్చిన
అమ్మకు మ్రొక్కెద భారతమ్మకు మ్రొక్కెద.
ఆలికి మొక్కెద మహంకాళికి మొక్కెద.

చదువుల తల్లికి టాటా
ఆటకు వేసిన బాటా
జీవన వేటలో దోహదపడిన ఆట
ఆదరించిన
ఆటల గురువులు
కొమురయ్య నర్సింగం రెడ్డిల
పాదాలకు వందనం.

నా బ్రతుకు దారి మల్లించిన
అక్షర జ్ఞానం లేని
విలక్షణ వ్యక్తులు
ఆగారెడ్డి అనసూయక్కల
పాదాలకు వందనం.