భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సాధారణ పరిశీలకులు రవి కిరణ్ స్పష్టం చేశారు. బుధవారం మెదక్ మున్సిపల్ పరిధిలో ఉన్న పలు వార్డులలోని పోలింగ్ కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను ఓటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు రవి కిరణ్ మాట్లాడుతూ.. మెదక్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. మెదక్ జిల్లా మున్సిపల్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని మెదక్ మున్సిపాలిటీలో 100 శాతం ఓటింగ్ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
11, ఫిబ్రవరి 2026, బుధవారంభారత్ సమాచార్