భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ ప్రశాంతంగా జరుగుతున్నట్లు సాధారణ పరిశీలకులు రవి కిరణ్ స్పష్టం చేశారు. బుధవారం మెదక్ మున్సిపల్ పరిధిలో ఉన్న పలు వార్డులలోని పోలింగ్ కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. పోలింగ్ సిబ్బందిని, పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను ఓటింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటూ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు రవి కిరణ్ మాట్లాడుతూ.. మెదక్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. మెదక్ జిల్లా మున్సిపల్ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో…