భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, ఫిబ్రవరి 2026, గురువారంభారత్ సమాచార్

గీతంలో ప్రయోగాల రూపకల్పనపై కార్యశాల

13578444-98c8-4479-8336-99a067e819e1

భారత్ సమాచార్, హైదరాబాద్: ‘జేఎంపీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ప్రయోగాల రూపకల్పన (డీవోఈ), గణాంక ఆప్టిమైజేషన్’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురువారం ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. ‘డిజైన్ ద్వారా నాణ్యత (క్యూబీడీ): ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ప్రయోగాల రూపకల్పనను సమగ్రపరచడం’ అనే అంశంపై రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 20-21) నిర్వహించిన సదస్సుకు సన్నాహకంగా దీనిని ఏర్పాటు చేశారు. జేఎంపీ సాంకేతికతను ఉపయోగించి ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డీవోఈ, గణాంక ఆప్టిమైజేషన్ టెక్నిక్ లను వర్తింపజేయడంపై ఆచరణాత్మక విధానాలపై కార్యశాల దృష్టి సారించింది. ప్రత్యక్ష ప్రదర్శనలు, కేస్ స్టడీల ద్వారా ప్రయోగాత్మక రూపకల్పన, డేటా విశ్లేషణ, సాక్ష్యం ఆధారిత నిర్ణయం తీసుకోవడంలో పాల్గొన్నవారు లోతైన అవగాహనను ఏర్పరచుకున్నారు.

 

 

జేఎంపీ అకడమిక్-ఇండియా అధిపతి మురళీధరన్ ఆనందమూర్తి ఈ కార్యశాలలో ప్రధాన వక్తగా పాల్గొన్నారు. బలమైన ఔషధ పరిశోధన కోసం సమర్థవంతమైన, క్రమబద్ధమైన ప్రయోగాలను నొక్కి చెప్పే స్క్రీనింగ్, ఆప్టిమైజేషన్ డిజైన్లు, ఫార్ములేషన్, మిక్స్ చర్ డిజైన్లు, కస్టమ్ డిజైన్ స్ట్రాటజీలు, క్యూబీడీ సూత్రాలు వంటి కీలక భావనలను ఆయన పరిచయం చేశారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ ప్రారంభోపన్యాసం చేయగా, డాక్టర్ పవన్ కుమార్ చింతమనేని తన స్వాగత ప్రసంగంలో వర్క్ షాపు లక్ష్యాలను వివరించారు. డాక్టర్ పూజా మిట్టల్ వందన సమర్పణ చేయగా, ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేయడంతో ఈ కార్యశాల విజయవంతంగా ముగిసింది.