భారత్ సమాచార్, హైదరాబాద్: ‘జేఎంపీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ప్రయోగాల రూపకల్పన (డీవోఈ), గణాంక ఆప్టిమైజేషన్’ అనే అంశంపై గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో గురువారం ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. ‘డిజైన్ ద్వారా నాణ్యత (క్యూబీడీ): ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ప్రయోగాల రూపకల్పనను సమగ్రపరచడం’ అనే అంశంపై రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 20-21) నిర్వహించిన సదస్సుకు సన్నాహకంగా దీనిని ఏర్పాటు చేశారు. జేఎంపీ సాంకేతికతను ఉపయోగించి ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డీవోఈ, గణాంక ఆప్టిమైజేషన్ టెక్నిక్ లను వర్తింపజేయడంపై ఆచరణాత్మక విధానాలపై కార్యశాల దృష్టి సారించింది. ప్రత్యక్ష…