భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, ఫిబ్రవరి 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఉపాధి కూలీలకు వెంటనే పని కల్పించాలి

1cb9f514-ee7b-44b4-a9c6-d9c24e3ab2fe

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ సూచన మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు అన్నారు. నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో సర్పంచి అధ్యక్షతన శుక్రవారం ఉపాధి హామీ పనుల గుర్తింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూలీలకు వెంటనే పని కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం చైల్డ్ మ్యారేజ్ నో భారత్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని బాల్యవివాహాలు చట్ట విరుద్ధమన్నారు. చదువుకునే వయసులో బాలికలకు చదువు చెప్పించాలని 18 సం.లు నిండిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మనబోయిన మల్లయ్య, వార్డు సభ్యులు నల్లాని పాపారావు, తుప్పతూరి నర్మద, ఐత వెంకటలక్ష్మి, బొజ్జ రేణుక, గిరగాని ప్రవీణ్,మాడుగుల మాధవ్, పంచాయతీ కార్యదర్శి మగ్న, ఫీల్డ్ అసిస్టెంట్ రవి, తదితరులు పాల్గొన్నారు.