భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఆగస్టు 2025, సోమవారంభారత్ సమాచార్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

08

భారత్ స‌మాచార్.నెట్, నెల్లూరు: జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి ఉలవపాడు మండలం చాగొల్లు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన నంబుల చిన వెంకటేశ్వర్లు కుటుంబం, బంధువులతో కలిసి తన మూడేళ్ల కుమారుడు అభినయ కృష్ణ పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు తుఫాన్ వాహనంలో తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యలో వారి వాహనం అతివేగంగా ముందు వెళ్తున్న ట్రాలీ లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటనర్సమ్మ, సుభాషిణి, అభినయ కృష్ణ, రుక్మిణి, యర్రం శ్రీనివాసరావు మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

పెళ్లయిన కొన్ని గంటల్లోనే నవవధువు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం