భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, ఫిబ్రవరి 2026, ఆదివారంభారత్ సమాచార్

సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం: సర్పంచ్ రేణుక నరేష్

WhatsApp Image 2026-02-21 at 3.46.05 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : ఇనుగుర్తి మండలం పెద్దతండా(సీఎం) గ్రామంలో అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన బానోతు జ్యోతి మంగుకు మంజూరైన రూ. 34,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు సర్పంచ్ బానోతు రేణుక నరేష్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాధావత్ శిరీష, వార్డు సభ్యులు బిక్షం, సంతోష్, బాలు, లక్ష్మి, కవిత కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ బాలు తదితరులు పాల్గొన్నారు.