భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : ఇనుగుర్తి మండలం పెద్దతండా(సీఎం) గ్రామంలో అనారోగ్య బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోంది. గ్రామానికి చెందిన బానోతు జ్యోతి మంగుకు మంజూరైన రూ. 34,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు సర్పంచ్ బానోతు రేణుక నరేష్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేస్తామని…





