భారత్ సమాచార్.నెట్, వికారాబాద్ : ఏఐసీసీ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల, ఏఐసీసీ శిక్షణ విభాగం ఇన్చార్జ్ సచిన్ రావు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి నేతలు చర్చించారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమలగారి ఆంజనేయులు గౌడ్ ఇతర జిల్లా అధ్యక్షులతో కలిసి ఈ శిబిరంలో పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై ఏఐసీసీ ప్రతినిధులు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.