భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గిరిజన తండాలో విద్యా వికాసం కోసం భూదానం చేసిన దాతలకు వందనం అంటూ.. దివికేగిన భూదాతల పేరున వారిని స్మరిస్తూ వారి వారసులు శిలాఫలకం ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం దుర్గాభవాని తండాలో విద్యాభివృద్ధి కోసం 1996లో సజీవంగా ఉన్న సమయంలో స్వర్గీయ గుగులోతు భోజ్య కీరి దంపతులు 10 గుంటల భూమిని దానపూర్వకంగా ఇచ్చారు. దీంతో వీరితోపాటు గుగులోతుకిష్టు, భీమ్లా, రాంధన్ జ్ఞాపకార్థంగా భోజ్య మనుమలు నవీన్, కిమ్లా, శ్రీను, రామచందర్, జగన్, సుమన్ లు సంబంధిత పాఠశాల ఆవరణంలో శిలాఫలకం ఏర్పాటు చేయగా ఎంఈఓ రాందాస్ పలువురుతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం భూదానం చేయడం అభినందనీయమని వారు పూజనీయులన్నారు. అంతకుముందు పాఠశాల హెచ్ఎం శ్రీదేవితో కలిసి అంగన్వాడి సెంటర్ కు నవీన్ ప్రెజర్ కుక్కర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వీరన్న, డిసిసి ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్, మాజీ సర్పంచి కొమ్ము అనిల్, పరిపాటి వెంకటరెడ్డి, గూగులోతు రాము, శంకర్, భూక్య వీరన్న, వడ్లకొండ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
24, ఫిబ్రవరి 2026, మంగళవారంభారత్ సమాచార్