భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గిరిజన తండాలో విద్యా వికాసం కోసం భూదానం చేసిన దాతలకు వందనం అంటూ.. దివికేగిన భూదాతల పేరున వారిని స్మరిస్తూ వారి వారసులు శిలాఫలకం ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం దుర్గాభవాని తండాలో విద్యాభివృద్ధి కోసం 1996లో సజీవంగా ఉన్న సమయంలో స్వర్గీయ గుగులోతు భోజ్య కీరి దంపతులు 10 గుంటల భూమిని దానపూర్వకంగా ఇచ్చారు. దీంతో వీరితోపాటు గుగులోతుకిష్టు, భీమ్లా, రాంధన్ జ్ఞాపకార్థంగా భోజ్య మనుమలు నవీన్, కిమ్లా, శ్రీను, రామచందర్, జగన్, సుమన్…