భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, ఫిబ్రవరి 2026, గురువారంభారత్ సమాచార్

ఈ నెల 27నుంచి లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవాలు

5cf34c26-352d-4afd-b126-1e20e4abadb4

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి చారిత్రక మహిమాన్విత శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారి వార్షిక కళ్యానోత్సవాలు ఈ నెల 27 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటించారు. ఆలయ ప్రధాన అర్చకులు టి.కృష్ణమాచార్యులు వివరాలు తెలుపుతూ.. 27 శుక్రవారం రాత్రి అంకురార్పణ ధ్వజారోహణం, వాస్తు పూజ, వాస్తు హోమం హోమం బలిహరణ, 28న సాయంత్రం 6 గంటలకు హోమం బలిహరణం, స్వామివారి అమ్మవారి ఎదుర్కోళ్ల ఉత్సవం, స్వామివారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. మార్చి 1న హోమం బలిహరణం స్వామి వారి సేవ, 2న హోమం బలిహరణం సదస్యం ఉంటుందన్నారు.  3న చంద్రగ్రహణం సందర్బంగా దేవాలయం ఉదయం 9 గంటల వరకు మూసివేయబడుతుంది. ఆలయం చుట్టూ బండ్లును తిప్పే వారు ఉదయం 9 లోపు ప్రదక్షిణలు చేసుకోవాలన్నారు. 4న ఉదయం దోపుపూజ, అర్చనలు, సాయంత్రం 6 గంటలకు వసంతోత్సవం తదుపరి స్వామి వారు శేష వాహనముపై గుట్ట మీది కి వెళ్లి చక్రస్నానము, ఆలయంలో 12 సేవలు 12 ప్రసాదాలు అరగింపు, భక్తులకు వినియోగం జరుగుతుందన్నారు. 5న రాత్రి 8 గంటలకు అద్దాల మహల్ లో పూజల కార్యక్రమం తదుపరి స్వామివారి అమ్మవారి పవళింపు సేవ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు.