భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, ఫిబ్రవరి 2026, శనివారంభారత్ సమాచార్

క్లాస్‌మెంట్ కూతురుకు తోటి స్నేహితుల చేయూత

8dcb4c98-d6a8-44b2-8c3e-ade6bb90b52c

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: క్లాస్‌మెంట్ ఇటీవల కన్నుమూయడంతో ఆమె కూతురు పేరున రు.70 వేల ఆర్థికసాయం చేశారు. రూ.70 వేలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి తోటి స్నేహితులు ఆదర్శంగా నిలిచారు. ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్‌లో 2009-10 విద్యా సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన వడ్డేపల్లి శైలజ ఇటీవల హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు సారిక, వర్షిని. చిన్న కూతురు వర్షిని పేరున క్లాస్‌మెంట్లు సుమారు 35 మంది కలిసి ప్రధానమంత్రి సుకన్యా యోజన పథకంలో భాగంగా రూ.70 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. శనివారం శైలజ దశదినకర్మకు వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మిత్రమా నీతో చదువుకుని కలిసి ఉన్న రోజులు మరువలేక పోతున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించి భర్త శ్రీనుకు, కూతుర్లకు సంబంధిత ఫిక్స్ బాండును అందజేశారు. కార్యక్రమంలో వల్లంల మురళి, రంజిత్, రహీం, బాలాజీ, నిర్మల, సౌజన్య, శ్రావణి, అనూష, రజిత, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.