భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, ఆగస్టు 2025, మంగళవారంభారత్ సమాచార్

మురుగు కాలువలో పడి చేనేత కార్మికుడు మృతి

01

భార‌త్ స‌మాచార్‌.నెట్, అనంతపురం: భారీ వర్షంలో ఇంటికి వెళ్తున్న ఓ చేనేత కార్మికుడు మురుగు కాలువలో జారిపడి మృతిచెందిన ఘ‌ట‌న ధర్మవరం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ధర్మవరం పేటబసవన్నకట్ట వీధికి చెందిన నాగరాజు (60) పట్టుచీరల దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఆదివారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో మురుగు కాలువను గమనించక అందులో పడిపోయాడు. కాలువలో వ్యక్తి చేయి కనిపించడంతో పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసి, నాగరాజుగా గుర్తించారు. మద్యం సేవించి ఉండడం, కాలువపై ఎలాంటి రక్షణ దిమ్మె లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య