భార‌త్ స‌మాచార్‌.నెట్, అనంతపురం: భారీ వర్షంలో ఇంటికి వెళ్తున్న ఓ చేనేత కార్మికుడు మురుగు కాలువలో జారిపడి మృతిచెందిన ఘ‌ట‌న ధర్మవరం పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ధర్మవరం పేటబసవన్నకట్ట వీధికి చెందిన నాగరాజు (60) పట్టుచీరల దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఆదివారం సాయంత్రం పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో మురుగు కాలువను గమనించక అందులో పడిపోయాడు. కాలువలో వ్యక్తి చేయి కనిపించడంతో పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటకు తీసి, నాగరాజుగా గుర్తించారు. మద్యం సేవించి…