భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, మార్చి 2026, ఆదివారంభారత్ సమాచార్

రామాయంపేట డివిజన్ ఏర్పాటు కలగానే : ప్రజా ఆగ్రహం

WhatsApp Image 2026-02-28 at 6.26.01 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల కల ఇంకా కార్యరూపం దాల్చకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ డివిజన్, కేవలం కాగితాలకే పరిమితమైందని ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో ఎన్నికల ముందు కార్యాలయాన్ని ప్రారంభించినా, గెజిట్ విడుదల కాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఈ అంశంపై స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజాంపేట, చేగుంట వంటి మండలాలతో కలిపి వెంటనే పూర్తిస్థాయి డివిజన్‌ను ప్రకటించాలని బీజేపీ నేతలు రాగి రాములు, సిద్ధ రాములు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.