భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల కల ఇంకా కార్యరూపం దాల్చకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ డివిజన్, కేవలం కాగితాలకే పరిమితమైందని ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో ఎన్నికల ముందు కార్యాలయాన్ని ప్రారంభించినా, గెజిట్ విడుదల కాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఈ అంశంపై స్పందించకపోవడంపై…





