భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ కోతి మాధవి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్రకమిటీ సమావేశం హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఇంతకుముందు ఉన్న రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. టీయూ జేఏసీ ఛైర్మన్‌గా కోతి మాధవి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కే.రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా గుండమల్ల శ్రీనివాస్, ఏలూరి బాబన్న, సాదం రాజన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డోలక్ యాదగిరి, సాయి బాబు, బీ.వెంకన్న, ఉపాధ్యక్షులుగా ఏ.శంకర్, రెహమాన్ అలీ, ఉదర శ్రీనివాస్, ఉప్పల్ శ్రీనన్న, ముడుపు నర్సన్న, సహాయ కార్యదర్శులుగా విష్ణు, చాంద్ పాషా, బుచ్చన్న, లింగంపల్లి మురళి ఎన్నికయ్యారు. టీయూ జేఏసీ సాంస్కృతిక విభాగం ఇంఛార్జ్‌గా విష్ణును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ కోతి మాధవి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన కళాకారులు, విద్యార్థులు, కార్మికులు , రైతులకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల ఫ్లాటు, రూ. 25,000 వేతనం ఇవ్వాలని కోరారు. ఈ నెల 10 మిలియన్ మార్చ్ డే ను అన్ని జిల్లాల్లో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
మరిన్ని కథనాలు:
టీయూ జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరిని బహిష్కరిస్తున్నాం: TU JAC