భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి పటిష్ట చర్యలు

3a81618d-ece3-4367-805c-54fcb69d6c3f

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికై సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ గ్రిడ్ మెదక్ నాగభూషణం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీటి సరఫరా నిలుపుదలపై 05, 06 మార్చి తేదీలలో క్రింది ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మెదక్ నియోజకవర్గ పరిధిలోని 275 గ్రామీణ హాబిటేషన్లు, మెదక్ జిల్లా, రామాయంపేట మున్సిపాలిటీలు. ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్, టేక్మల్ మండలాల్లో 80 హాబిటేషన్లు, ప్రభావిత హాబిటేషన్ల సర్పంచ్‌లకు సంబంధిత మండల గ్రూపుల ద్వారా సమాచారం అందించబడిందని తెలిపారు. సర్పంచులు స్థానిక వనరుల ద్వారా నీటి సమస్యను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం మాట్లాడుతూ.. వచ్చే వేసవి దృష్ట్యా 04.03.2026, 05.03.2026 తేదీలలో కింది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టడం నిర్ణయించబడిందని తెలిపారు. 90 ఎంఎల్ డీ పెదరెడ్డిపేట WTP – వివిధ నిర్వహణ పనుల నిమిత్తం 1000 మి.మీ. డయా పైప్‌లైన్ లీకేజీల మరమ్మత్తు, రాయిపహాడ్ OHBR వద్ద స్లూయిస్ వాల్వ్ మరమ్మతులు, అన్ని సివిల్ నిర్మాణాలు (OHBRలు మరియు సంపులు) శుభ్రపరచడం వంటివి చేపడుతున్నట్లు అలాగే యెల్లాపూర్ వద్ద 700 మి.మీ. DI స్లూయిస్ వాల్వ్ మరమ్మత్తుల 06.03.2026 సాయంత్రం 6 గంటల తరువాత పంపింగ్ పునః ప్రారంభించబడుతుందని తెలిపారు.