భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, మార్చి 2026, శుక్రవారంభారత్ సమాచార్

పేదింటి ఆడబిడ్డకు పుస్తే మెట్టలు అందజేసిన శివగోని పెంటాగౌడ్

4c483f36-03a8-4388-8ddc-e3c3f53fe9b2

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామ సర్పంచ్‌ గా శివగోని పెంటాగౌడ్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నందున స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సర్పంచ్ శివగోని పెంటాగౌడ్ ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో పెంజర్ల అశోక్ – నాగమణి దంపతుల కుమార్తె నవనీత (రేఖ) వివాహ వేడుకలో రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు శివగోని పెంటా గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పుస్తె మెట్టెలు అందజేసి ఆశీర్వదించారు. వివాహ కార్యక్రమంలో సర్పంచ్ శివగోని పెంటాగౌడ్ తో పాటు సురేందర్ రెడ్డి, వెంకట్ చారి మరియు పలువురు గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు వెంకట్ చారి, సురేందర్ రెడ్డి లు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న లింగారెడ్డిపేట్ సర్పంచ్ శివగోని పెంటాగౌడ్ సేవలను అభినందించారు. ప్రజల మద్దతుతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.