భారత్ సమాచార్.నెట్, మెదక్: తూప్రాన్ పట్టణంలోని 14వ వార్డులో పేదల గృహ కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దుర్గం నగేష్, నాచారం దేవస్థానం చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని వారు ఆకాంక్షించారు.