భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని ఈ మేరకు అసెంబ్లీలో గళం విప్పాలని కోరుతూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ ఈయూ) ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సోనబోయిన రవిచంద్ర ఆధ్వర్యంలో తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికార పార్టీ ఇచ్చిన హామీ మేరకు వెంటనే సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం రిటైర్ అవుతున్న ఉద్యోగులకు కేవలం రూ.1500 నుంచి 3000 రూపాయల లోపే పెన్షన్ వస్తుందని, 30 ఏళ్లు సేవ చేసిన వారికి సామాజిక భద్రత కరువవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడెపు భిక్షపతి, చెడుపల్లి ఐలయ్య, తాళ్ల ప్రణయ్, ఇమామ్, సునీత, సాయి కుమార్ ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
8, మార్చి 2026, ఆదివారంభారత్ సమాచార్