భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, ఆగస్టు 2025, శుక్రవారంభారత్ సమాచార్

రైలు ప్రమాదం.. కూలీ మృతి, మరొకరికి గాయాలు

03

భార‌త్ స‌మాచార్‌.నెట్, కుమురం భీం: సిర్పూర్ (టి) మండల కేంద్రంలో రైల్వే ట్రాక్ మీద పనిచేస్తున్న కూలీలపైకి గూడ్స్ రైలు రివర్స్‌లో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక కూలీ అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి సిర్పూర్-కాగజ్‌నగర్ మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సిర్పూర్‌కు చెందిన జంషీద్ హుస్సేన్ (44) అనే కూలీ పైకి రివర్స్‌లో వస్తున్న గూడ్స్ రైలు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అతను రెండు ముక్కలై మృతిచెందాడు. మరో కూలీ ప్రవీణ్‌కు చేయి విరిగింది. అతడిని హైదరాబాద్‌కు తరలించారు. రైలు రివర్స్ వస్తున్న విషయాన్ని అధికారులు కూలీలకు సమాచారం ఇవ్వలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపించారు. పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. చివరకు కాంట్రాక్టర్ పరిహారం ఇచ్చేందుకు అంగీకరించడంతో ఆందోళన విరమించారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

అమాన‌వీయ ఘ‌ట‌న.. కూతురిపై తండ్రి లైంగిక దాడి