భార‌త్ స‌మాచార్‌.నెట్, కుమురం భీం: సిర్పూర్ (టి) మండల కేంద్రంలో రైల్వే ట్రాక్ మీద పనిచేస్తున్న కూలీలపైకి గూడ్స్ రైలు రివర్స్‌లో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒక కూలీ అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి సిర్పూర్-కాగజ్‌నగర్ మధ్య రైల్వే ట్రాక్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సిర్పూర్‌కు చెందిన జంషీద్ హుస్సేన్ (44) అనే కూలీ పైకి రివర్స్‌లో వస్తున్న గూడ్స్ రైలు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అతను రెండు ముక్కలై మృతిచెందాడు. మరో కూలీ ప్రవీణ్‌కు చేయి…