భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, మార్చి 2026, శనివారంభారత్ సమాచార్

విశ్వకర్మ కిట్టు పొందిన వెంకటచారికి ఘన సన్మానం

WhatsApp Image 2026-03-13 at 7.30.40 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వృత్తి నైపుణ్యంతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని నిరూపిస్తూ, కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ పథకం ద్వారా వృత్తి సామాగ్రిని (కిట్టు) అందుకున్న తూప్రాన్ డివిజన్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు వెంకటచారికి తూప్రాన్‌లో ఘన సన్మానం జరిగింది. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్‌కు చెందిన ఆయన, వృత్తి నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గాను స్థానిక నాయకులు ఆయనను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వెంకటచారిని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా వృత్తిదారులకు సమాజంలో సముచిత స్థానం, ఆర్థిక భరోసా లభిస్తోందని నాయకులు పేర్కొన్నారు. వెంకటచారి తన సేవల ద్వారా విశ్వకర్మ పంచకులాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు మాలజంగం స్వామి, చెట్లపల్లి నర్సింహులు, గ్రామ పెద్దలు మరియు విశ్వకర్మ సంఘ సభ్యులు పాల్గొన్నారు.