భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వృత్తి నైపుణ్యంతోనే సామాజికాభివృద్ధి సాధ్యమని నిరూపిస్తూ, కేంద్ర ప్రభుత్వ విశ్వకర్మ పథకం ద్వారా వృత్తి సామాగ్రిని (కిట్టు) అందుకున్న తూప్రాన్ డివిజన్ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు వెంకటచారికి తూప్రాన్‌లో ఘన సన్మానం జరిగింది. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్‌కు చెందిన ఆయన, వృత్తి నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గాను స్థానిక నాయకులు ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వెంకటచారిని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ…





