భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, మార్చి 2026, శనివారంభారత్ సమాచార్

ఉపాధి హామీ రద్దు కుట్రను అడ్డుకుంటాం

WhatsApp Image 2026-03-13 at 9.17.14 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తుంకుంట ఆంక్ష రెడ్డి విమర్శించారు. శుక్రవారం మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, రామాయుపల్లి, లింగారెడ్డిపేట తదితర గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులతో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో వారు మాట్లాడారు.

పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు, నిధుల్లో కోత విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. యూపీఏ హయాంలో వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కాపాడుకునేందుకు కార్మికులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. 60:40 నిష్పత్తిలో నిధుల భారం రాష్ట్రాలపై మోపడం అన్యాయమని, లేబర్ కోడ్ల ద్వారా కార్మికుల హక్కులను హరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.