భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తుంకుంట ఆంక్ష రెడ్డి విమర్శించారు. శుక్రవారం మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి, రామాయుపల్లి, లింగారెడ్డిపేట తదితర గ్రామాల్లో ఉపాధి హామీ కార్మికులతో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో వారు మాట్లాడారు.
పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు, నిధుల్లో కోత విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. యూపీఏ హయాంలో వలసల…





