భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, మార్చి 2026, బుధవారంభారత్ సమాచార్

నర్సాపూర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

WhatsApp Image 2026-03-17 at 7.53.45 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వ విందును ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ఆస్వాదించారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదరుల కోసం ప్రభుత్వం ఈ ప్రత్యేక విందును ఏర్పాటు చేసిందని తెలిపారు.

అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, రెవెన్యూ సిబ్బంది పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుక అందరిలో స్నేహభావాన్ని నింపింది.