భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

ఐక్యమత్యంతోనే గ్రామాభివృద్ధి: సర్పంచ్ సుజాత యాకయ్య

a5924161-c89d-4350-9c31-ac9594c320a3

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా ఐకమత్యంతో పరిష్కరించుకుందామని సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య అన్నారు. ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారంలో సర్పంచి అధ్యక్షతన బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామస్తులు హాజరై పలు సమస్యలను సర్పంచి, పంచాయతీ కార్యదర్శితో సహా పాలక మండలి దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైన చోట్ల సిసి, సైడ్ కాలువలు, ముత్యాలమ్మ ఆలయ భక్తుల కోసం ఖరీదు చేసిన భూమి, పారిశుద్ధ్య నిర్వహణ, గజ్జి కుక్కలు, కోతుల బెడద, కరెంట్, సోలార్ విద్యుత్, చేపల ధర, ఆదాయ వ్యయాలు తదితర సమస్యలపై చర్చించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్, పంచాయతీ కార్యదర్శి గండు అనిల్ కుమార్, వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు, బైరు వినయ్ గౌడ్, నిడిగంటి చంద్రమౌళి, చెడుపాక సురేష్, ముత్యాల సోమక్క, మునిగంటి సరిత, గుండాల మంగమ్మ, చెడుపాక అలివేలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, విద్యుత్ శాఖ, అంగన్వాడి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.