భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, మార్చి 2026, శుక్రవారంభారత్ సమాచార్

నర్సాపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు: పంచాంగ శ్రవణం

WhatsApp Image 2026-03-19 at 9.11.08 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హరిప్రసాద్ శర్మ, వీరప్ప గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ పాల్గొని భవిష్యత్ ఫలితాలను తెలుసుకున్నారు. అనంతరం భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని చైర్మన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ ఉత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.