భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా హరిప్రసాద్ శర్మ, వీరప్ప గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్ పాల్గొని భవిష్యత్ ఫలితాలను తెలుసుకున్నారు. అనంతరం భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు పాల్గొని ప్రత్యేక…





