భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మార్చి 2026, గురువారంభారత్ సమాచార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మామడ ఎస్సై

28

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: సమాజంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ.. జీతమే కాకుండా.. మరింత ఎక్కువ డబ్బులు పొందాలనే ఆశతో కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. వారి స్థాయికి అనుగుణంగా ప్రజల నుంచి లంచం రూపంలో దోచుకుంటున్నారు. తాజాగా లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఓ బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన
ఏసీబీ అధికారులు పథంకం వేసి.. లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లాలో జరిగింది. మామడ పోలీస్ స్టేషన్ ఎస్సై అశోక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఏసిబి డిఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం ఓ భూ వివాదం కేసులో ఓ వ్యక్తిని చీటింగ్ కేసు నుంచి తప్పించడానికి ఎస్సై రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం.అనంతరం బేరసారాల తర్వాత రూ.20 వేలకు ఒప్పందంకుదుర్చుకున్నాడు.దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఎస్సై అశోక్ కు లంచం ఇస్తుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నారు.అనంతరం ఎసిబి అధికారులు ఎస్సై అశోక్ ను విచారించి తదుపరి చర్యల నిమిత్తం కరీంనగర్ ఏసిబి కోర్టుకు తరలించారు.కాగా,మూడేళ్ల క్రితం ఇదే మామడ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం.