భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆడంబరాల కోసం లక్షలు కుమ్మరించే ఈ రోజుల్లో, ఒక రైతు తన మనవడి పుట్టినరోజును కేవలం రూ.100 ఖర్చుతో జరిపి ఆదర్శంగా నిలిచారు. ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లికి చెందిన పోలీస్ కానిస్టేబుల్, ఆదర్శ రైతు పెండెం వెంకన్న పటేల్, తన మనవడి జన్మదిన వేడుకలను ప్రకృతి ఒడిలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనవడికి 120 మామిడి మొక్కలను బహుమతిగా ఇచ్చారు. “ప్రస్తుతం వేడుకల కోసం అప్పులు చేయడం ఫ్యాషన్‌గా మారింది. కానీ, నేను నాటిన ఈ మొక్కలు మనవడు ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి ఫలాలనిస్తాయి. ఆ ఆదాయం తన ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. పర్యావరణహితంతో పాటు భవిష్యత్తుకు భరోసానిచ్చిన వెంకన్న పటేల్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
BHARATH SAMACHAR DIGITAL
28, మార్చి 2026, శనివారంభారత్ సమాచార్