భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, మార్చి 2026, శనివారంభారత్ సమాచార్

ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

WhatsApp Image 2026-03-27 at 8.58.25 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, కన్నుల పండుగగా జరిగింది. సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ పవిత్ర ఘట్టం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఆలయ ప్రాంగణమంతా పూల అలంకరణలతో శోభాయమానంగా దర్శనమివ్వగా, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ కల్యాణం గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది. ఇంతటి వైభవంగా వేడుకలు నిర్వహించినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.