భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శ్రీరామనవమిని పురస్కరించుకుని రామాయంపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, కన్నుల పండుగగా జరిగింది. సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ పవిత్ర ఘట్టం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఆలయ ప్రాంగణమంతా పూల అలంకరణలతో శోభాయమానంగా దర్శనమివ్వగా, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని…





