భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, మార్చి 2026, ఆదివారంభారత్ సమాచార్

ది జైన్ ఇంటర్నేషనల్ పాఠశాలకు ఉత్తమ రెసిడెన్షియల్ క్యాంపస్ అవార్డ్

92a5f09e-b83c-4816-99d3-d36b497b5431

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026లో రెసిడెన్షియల్ విద్యలో శ్రేష్ఠత్వాన్ని సమగ్ర విద్యార్థి అభివృద్ధిని గుర్తిస్తూ, తూప్రాన్ పట్టణంలోని ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ప్రతిష్టాత్మకమైన “తెలంగాణలోని ఉత్తమ రెసిడెన్షియల్ క్యాంపస్” అవార్డు లభించింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ అవార్డును పాఠశాల తరపున అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, దక్షిణామూర్తి ప్రిన్సిపాల్, శ్రీలక్ష్మి అందుకున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కళాభవన్‌ లో జరిగింది. విద్యాసంస్థ సమగ్ర విద్యా వాతావరణాన్ని, అందించడంలో అకాడమిక్ శ్రేష్ఠత ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, విలువ-ఆధారిత విద్య, సమగ్ర విద్యార్థి అభివృద్ధిని సమీకృతం చేయడంలో పాఠశాల నిబద్ధతకు ఈ గుర్తింపు ఒక నిదర్శనం. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు, తల్లిదండ్రులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.