భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, మార్చి 2026, సోమవారంభారత్ సమాచార్

మహిళ గర్భాశయం నుంచి 2 కిలోల కణితి తొలగింపు

WhatsApp Image 2026-03-29 at 9.02.44 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలోని సుష్మా హాస్పిటల్ వైద్యులు ఆదివారం ఒక అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ధాతర్‌పల్లి గ్రామానికి చెందిన బోసభోయిన లక్ష్మీ (45) తీవ్ర కడుపునొప్పి, రక్తహీనతతో ఆసుపత్రిలో చేరగా, ఆమె గర్భాశయంలో సుమారు రెండు కిలోల బరువున్న భారీ ఫైబ్రాయిడ్ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రోగికి అరుదైన ‘బి నెగిటివ్’ రక్తగ్రూప్ కావడంతో, ఆమె కుమారుల నుంచి రక్తాన్ని సేకరించి ప్రత్యేక జాగ్రత్తల నడుమ ఆపరేషన్ చేపట్టారు. డాక్టర్ హేమరాజ్ సింగ్, డాక్టర్ ప్రదీప్ సింహ నేతృత్వంలోని వైద్య బృందం రెండు గంటల పాటు శ్రమించి ఆ భారీ గడ్డను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికంగానే ఇలాంటి క్లిష్టమైన చికిత్స అందించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.