భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, ఏప్రిల్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

సమస్యల పరిష్కారానికి వేదిక గ్రామసభ: కలెక్టర్ స్నేహ శబరీష్

12

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామస్థాయిలో ప్రతి సమస్య పరిష్కారానికి బలమైన వేదిక గ్రామసభని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు మండలంలోని వివిధ గ్రామాలలో ఆయా సర్పంచ్ ల అధ్యక్షతన గురువారం ఘనంగా జరిగాయి.ఈ క్రమంలో కలెక్టర్ గురువారం ఇనుగుర్తిలో సర్పంచి తమ్మడపల్లి కుమార్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచి తో పాటు మాజీ సర్పంచి రామ్మూర్తి, హెచ్ఎం వీరన్న నాయక్ తో సహా పలువురు గ్రామస్తులు పలు సమస్యలు సభలోని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగాఓపికతో విన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా,గృహ జ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. సభలోని సమస్యలను సంబంధిత శాఖల అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లల విద్యపై దృష్టి పెట్టడం, ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. వాణిజ్య పంటల వైపు రైతులను ఆకర్షించాలని, ఆయిల్ ఫామ్, సాగు లాభదాయకంగా ఉందన్నారు, అంతర్ పంటల ద్వారా రైతులకు అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. నానో యూరియా పై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు,కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,ఎంపీడీవో పార్థసారథి, డిటి తరంగిణి, ఎంఈఓ రూపా రాణి,ఉపసర్పంచ్ యాదగిరి,దిశ సభ్యులు బాబురావు,జిపి కార్యదర్శి లక్ష్మీకాంత్,ఆయా శాఖల అధికారులు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.